
నారద స్టింగ్ ఆపరేషణ్ కేసులో ఇవాళ ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కాసేపటి క్రితం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సీఎం మమతా బెనర్జీ క్యాబినెట్ లోని ఫిర్ హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నారద బ్రైబరీ కేసులో వారిని అరెస్టు చేశారు. నారద న్యూస్ చేపట్టిన ఆ స్టింగ్ ఆపరేషన్ లో వీరంతా కెమెరా ముందే ముడుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు.