
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్ లో రెసిడెంట్ గ్రీవెన్స్ ని నియమించింది. భారత్ కు చెందిన వినయ్ ప్రకాశ్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సంస్థ వెబ్ సైట్ లో ఆయన వివరాలు ఉంచింది. అందులోని ఈ మెయిల్ కి ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది. గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.