
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షలు ఇవాళ, రేపు జరగనున్నాయి. మూడేళ్ల లా కోర్సుల ప్రవేశ పరీక్ష ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆదేవిధంగా పీజీలాసెట్, ఐదేళ్ల కోర్సు ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఆల్ లైన్ విధానంలో నిర్వహించనున్న లాసెట్ పరీక్షల నిర్వహణకు 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.