Director Partho Ghosh: బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు పార్థో ఘోష్ గుండెపోటుతో కన్నమూశారు. 100 డేస్, దలాల్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన మరణ వార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.