
అరేబియా సముద్ర తీరంలోని రాష్ట్రాలను తౌటే తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం దాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై చర్చించారు.