
కరోనా వైరస్ తో ఈ ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ కు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టోక్యో 2020 అధ్యక్షురాలు సీకో హషిమోటో శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదనే నిర్ణయం తీసుకోగా హషిమోటో తాజా వ్యాఖ్యలతో జపనీయులు కూడా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని దూరం చేసుకునే అవకాశం ఉది. అయితే దీనిపై జూన్ లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.