Homeఆధ్యాత్మికంToday 8 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వద్దన్నా...

Today 8 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వద్దన్నా డబ్బు..

Today 8 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి చల్లని చూపు ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కోరాల్సి ఉంటుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. అయితే వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించాలి

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు గతంలో మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. శుభకార్యం కోసం బిజీగా మారిపోతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది ఇప్పటికే ఉద్యోగాలు చేసే వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఓ సమస్య కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థుల చదువుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంతో కలిసి ఉత్సాహంగా ప్రయాణాలు చేస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలకని నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు ఇంట్లో అనుకోకుండా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా పదోన్నతి పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాజు వారు ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. శక్తి సామర్థ్యాల మేరకే ఖర్చులు పెట్టాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవసరాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version