
మానేరు వాగులో దిగి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద చోటు చేసుకుంది. ఐతురాజుపల్లి గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మానేను వాగులో స్నానానికి దిగారు. ఈ క్రమంలో వాగులో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతోవారిలో ముగ్గురు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని స్థానికులు కాపాడారు. అనంతరం గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఐతరాజుపల్లికి చెందిన జోగుల ఆశీష్, జోగుల మనోజ్‌తో పాటు వేములవాడకు చెందిన రాహుల్‌గా గుర్తించారు.