
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 19,43,488 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 41,806 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.7 శాతం పెరుగుదల కనిపించింది. రెండు రోజుల క్రితం 31వేలకు తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. నిన్న మరో 581 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.09 కోట్లకు చేరగా 4,11,989 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.