
ప్రముఖ చిత్రకారుడు ఎల్. గోఫి (69) మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు తన కుంచెతో అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. గోపి మరణంతో తెలంగాణ గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా చిత్రకారుడి కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్ తో చికిత్స పొందతూ ఎల్. గోపి శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం కొవిడ్ నిబంధనలను అనుసరించి దహన సంస్కారాలు నిర్వహించారు.