
ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. కానీ భక్తులు లేకుండానే కోవిడ్ నియమావళితో యాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కే జెనా తెలిపారు. కేవలం ఆలయ అర్చుకులు, కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది కూడా సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే జగన్నాథుడి రథయాత్ర సాగింది. జూలై 12వ తేదీన పూరిలో రథయాత్ర జరగనున్నది.