
తండ్రిని వాట్సప్ ద్వారా బెదిరించి ఏకంగా రూ. కోటి డిమాండ్ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో జరిగింది. శాలిమార్ గార్డెన్ ఏరియాకు చెందిన 11 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక.. తండ్రి ల్యాప్ టాప్ నుంచే అయనకు సందేశం పంపింది. రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. తిట్టడం వల్లే ఈ పనిచేసినట్లు బాలిక అంగీకరించింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.