
హిమాలయ పర్వతాల్లోని చార్ ధామ్ లో గల నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి. రేపు కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ఉత్తరాఖండ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్య విషయం ఏమిటంటే ఆలయ అలంకరణ కోసం మొత్తం 11 క్వింటాళ్ల పూలను వినియోగించారు.