
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వరుణుడు అడ్డంకులు మొదటు పెట్టాడు. మ్యాచ్ జరిగే సౌథాంప్టన్ లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్ ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు అంఫైర్లు మైదానంలోకి వెళ్లి పరీక్షించారు. జల్లులు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ పోరుకు అరగంటలో టాస్ పడుతుందనగా బీసీీసీఐ అక్కడి వాతావరణ పరిస్థితులపై అప్ డేట్ ఇచ్చింది. తొలిరోజు తొలి సెషన్ ఆట ఉండదని ప్రకటించింది.