
గుంటూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల డ్రెయిన్ లో కొట్టుకుపోయిన ఐదేళ్ల బాలుడు శవమై తేలాడు. గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. శివరాంనగర్ కి చెందిన పుల్లయ్య, మంగమ్మల రెండో కుమారుడు పీకల వాగు ఒడ్డున ఆడుకుంటున్నాడు. అక్కడే ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు డ్రెయిన్ లో పడి ప్రవాహనికి కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. ఈరోజు సంపత్ నగర్ వద్ద బాలుడు మృతదేహం లభ్యమైంది.