
కరోనా మహమ్మారి శతాబ్ధ కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద విషాదం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఇటువంటి మహమ్మారి అనుభం కాలేదని చెప్పారు. అన్ని వర్గాలకు ఉచితంగా టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ప్రస్తుం కరోనా రెండో వేవ్ తో భారత్ కఠినంగా పోరాడుతున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచామని వెల్లడించారు.