
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారిపై సీఎం కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని భాజపా నేత స్వామిగౌడ్ ఆరోపించారు. రాష్ట్రం నుంచి పోమ్మనకుండానే పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని మాజీ మంత్రి చంద్ర శేఖర్ నివాసంలో ఉద్యమ ఆకాంక్షలే సాధన లక్ష్యంగా జరిగిన ఉద్యమకారుల సమావేశంలో స్వామిగౌడ్ తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడంలేదన్నారు.