
ఛత్రసాత్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమర్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు ప్రక్రియ లైసెన్స్ డిపార్ట్ మెంట్ ప్రాంభించినట్లు తెలిపారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం సుశీల్ కుమార్ ను హరిద్వార్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు.