Suryakumar Yadav: ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పొరు. టీ20ల్లో వరుసగా 14 సార్లు 25 పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచారు. తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ బపుమా 13 సార్లు 25 పైగా పరుగులు చేశాడు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును బ్రేక్ చేశారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ లో సూర్య 14 మ్యాచ్ ల్లో 5 అర్దసెంచరీలతో 640 పరుగులు చేశారు.