
సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పరు వస్తోందని విచారించింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యు పై బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తబ్లీగి జమాత్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.