
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ ఆవరణలోకి ప్రమాణికులను మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట మరో వ్యక్తికి డ్రైవర్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయనున్నారు.