
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు వరుసగా మూడో రోజూ కొనసాగింది. శుక్రవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకుాలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం 49,169 వద్ద లాభాలతో ప్రాంభమైన సెన్సెక్స్ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 49,036 వద్ద కనిష్టాన్ని 49,417 వద్ద గరిష్టాన్ని చవిచూసింది.