
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడి దేశీయ సూచీలపై పడింది. దీంతో మెజారిటీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. చివరకు సెన్సెక్స్ 273 పాయింట్ల నష్టంతో 52,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 15,746 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.48 వద్ద నిలిచింది.