
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. స్టెరాయిడ్స తక్కువగా తీసుకోవాలని కోరారు. కరోనా దుష్ర్పభావాలను నివారించేందుకు ప్రజలు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారని వారికి తక్కువ మొత్తం లో ఇవ్వాలని వైద్యులకు సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితులకు చికిత్సలు చేసే సమయంలో వైద్యులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించాలని కోరారు.