
కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి తక్కువ సంఖ్యలోనే దర్శన టికెట్లను జారీ చేస్తున్నామని తితిదే ఈవో కె. ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా మూడో దశకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అద్దె గదులను ఆధునికీకరించి భక్తులకు సులభతరంగా అందిస్తున్నామని చెప్పారు.