
సీఎం జగన్ తో జాతీయ భవన నిర్మాణ కార్మకుల సలహా మండలి బోర్డు చైర్మన్ వి. శ్రీనివాసులునాయుడు సోమవారం భేటీ కానున్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్టు నిధి 2500 కోట్లు పక్కదారి పట్టించిన వైనం పై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. రెండున్నర ఏళ్లుగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని శ్రీనివాసులు నాయుడు నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చిన నిధులు వైసీపీ ప్రభుత్వం కార్మికులకు కేటాయించలేదని శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పై విమర్శల నేపథ్యంలో సీఎం భేటీకి ప్రాధాన్యత సంతరించకుంది.