
రష్యా డైరెక్ట ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్ లు స్పుత్నిక్-వి కోవిడ్ వ్యాక్సిన్ తయారీని భారత్ లో ప్రారంభించాయ. ఈ మేరకు రెండు సంస్థలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. హిమాచల్ ప్రదేశ్ లోని బద్ది వద్ద ఉన్న పనాసియా బయోటెక్ తయారీ కేంద్రం వద్ద వ్యాక్సిన్ ను ఉత్పత్తిని మొదలు పెట్టినట్లు తెలిపాయి. వ్యాక్సిన్ తయారు చేశాక న్యాణ్యతను పరీక్షించేందుకు రష్యాలోని గమాలియా సెంటర్ కు పంపిస్తామని తెలిపాయి.