
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి. రష్యా నుంచి హైదరాబాద్ కు ఇవి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 50 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్పుత్నిక్ వీ టికాను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ రూపొందించింది. ఈ టీకా భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణ కోసం డాక్టర్ రెడ్డీస్ రష్యాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.