Tollywood Film Industry: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి 30 ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీకి ఛైర్మన్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఉన్నారు.