https://oktelugu.com/

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. కోట్లలో పన్ను ఎగవేత

ప్రముఖ హీరో సోనూసూద్ చిక్కుల్లో పడ్డాడు. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇటీవల ఐటీ అధికారులు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడు రోజుల పాటు ఈ సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 18, 2021 / 01:50 PM IST
    Follow us on

    ప్రముఖ హీరో సోనూసూద్ చిక్కుల్లో పడ్డాడు. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇటీవల ఐటీ అధికారులు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడు రోజుల పాటు ఈ సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది.

    సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ. 2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్ తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు.

    కరోనా సమయంలో సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ. 18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ. 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు.  విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీపార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి.