
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా వైరస్ కారణంగా 447 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,02,188 ఉన్నాయని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.40 శాతానికి చేరుకుంది.