
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాలో రాష్ట్రంలో రిగ్బి మిడిల్ స్కూల్ లో గురువారం ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఆరో తరగతి చదువుతన్న బాలిక తన వెంట తెచ్చుకున్న తుపాకీ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్లుల్లో ఇద్దరు విద్యార్థులు, మరొకరు స్కూల్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్నారు.