
భారతదేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 12 కిలోల హెరాయిన్ ను డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళల వద్ద రూ. 78 కోట్ల విలువైన హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.