
తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కేసీర్ గారు మహిళలను చిన్నచూపు చూస్తున్నారు అని, మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్ ఘనుడు అని అన్నారు. తెలంగాణలోని మహిళల సమస్యలను పరిష్కరించడానికి ఒక జేఏసీ ని ఏర్పాటు చెయ్యాలని, అన్ని పార్టీల మహిళా విభాగాల వారితో కలిసి గవర్నర్ గారిని కలుస్తానని తెలిపింది. రాష్టంలో తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు కోసం మహిళలందరూ కలిసి బలమైన ఉద్యమం చెయ్యాలని అన్నారు.