
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కరోనా మహమ్మారిని కట్టడీ చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, కలెక్టర్ వి.పి గౌతమ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.