
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలను తప్పుపట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. తాలిబన్ ఉగ్రవాద సంస్థను సృష్టించినదే పాకిస్థాన్ అని, ప్రపంచంలో ఉగ్రవాదానికి బాధ్యత కూడా వాళ్లేదేనని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితికి కూడా పాకిస్థానే కారణమని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాలిబన్ సహకారంతో పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యాప్తి చేస్తుందని అన్నారు.