
టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి కోహ్లీ సేనతో కలవనున్నాడు. దాదాపుగా 17 రోజుల తర్వాత అతడికి నెగిటివ్ వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా వేయడానికి ముందే సహాకు పాజిటివ్ వచ్చింది. దాంతో మే 4న ముంబాయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వాయిదా పడింది. అయితే సాహాకు లక్షణాలు ఉండటంతో దిల్లీలోనే ఐసోలేషన్లో ఉన్నాడు. టోర్నీ వాయిదా పడ్డాక కోలో కతాకు వచ్చి క్వారంటైన్ లో గడిపాడు.