ABN RK
RK kottapaluku : ఇటీవల ఢిల్లీ హైకోర్టు(Delhi High court) లో న్యాయమూర్తిగా పనిచేస్తున్న యశ్వంత్ శర్మ(Yashwant Sharma) ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందికి యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు కనిపించాయి. వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని కొలీజియం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యశ్వంత్ శర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. యశ్వంత్ శర్మ 2021 వరకు అలహాబాద్ కోర్టులోనే పనిచేయడం విశేషం. నోట్ల కట్టలు లభించినప్పటికీ.. అన్ని వైపుల నుంచి వేళ్ళు ఎత్తి చూపించినప్పటికీ.. న్యాయవ్యవస్థ సరిగ్గా స్పందించలేదని.. యశ్వంత్ శర్మ పై చర్యలు తీసుకోలేదు అనేది వేమూరి రాధాకృష్ణ ఆగ్రహానికి ప్రధాన కారణం. తన ఆగ్రహాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కొత్త పలుకులో ప్రతి అక్షరం లోను ఆయన ప్రతిబింబించారు. ఒక పాత్రికేయుడిగా.. పత్రికాధిపతిగా.. ఛానల్ ఓనర్ గా రాధాకృష్ణ ఇలాంటి విషయాల మీద ఇంతటి సుదీర్ఘ ఎడిటోరియల్ రాయడం నిజంగా గొప్ప విషయం. కానీ న్యాయ వ్యవస్థను ప్రశ్నించిన రాధాకృష్ణ.. మీడియా ఆధిపతులను ఎందుకు వదిలేసినట్టు.. మీడియాధిపతులు సుద్ధ పూసలు కాదు కదా.. యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రోత మీడియా ఫస్ట్ పేజీలో అప్రధాన్య వార్త రాసిందని రాధాకృష్ణ ఆరోపించాడు. మరి ఇదే రాధాకృష్ణ తన పత్రికలో రామోజీరావు ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వినిపించినప్పుడు.. ఏపీ సిఐడి అధికారులు విచారణ సాగించినప్పుడు.. మార్గదర్శి వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వెలుగులోకి వచ్చినప్పుడు ఎలాంటి వార్తలు రాశారు? ఆయిల్ రాసుకుంటే జుట్టు వస్తుందని అప్పట్లో ఓ మీడియా ఆధిపతి చేసిన ప్రచారాన్ని తన ఫస్ట్ పేజీలో రాసిన రాధాకృష్ణ.. తర్వాత ఎందుకు మర్చిపోయారు.. ఆ మీడియా అధిపతి ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆయిల్ కంపెనీ యాడ్ ఇస్తే ఎందుకు పబ్లిష్ చేశారు.. విలువల గురించి.. అవినీతి రహిత సమాజం గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణ.. ఎన్నికల సమయంలో పెయిడ్ ఆర్టికల్స్.. ఇతర వ్యవహారాలను నడుపుతున్నది నిజం కాదా.. ఇది నిజం కాదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా..
అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి
మనదేశంలో కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే కాదు మీడియా వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయింది. ఎన్నికల సమయంలో పెయిడ్ ఆర్టికల్స్ పబ్లిక్ చేయడం.. ఆ డబ్బును దొంగ చాటుగా జిల్లాలో పనిచేస్తున్న బ్రాంచ్ మేనేజర్లు, బ్యూరో ఇన్చార్జులు, ఏడివిటీ ఇన్చార్జిలు హైదరాబాదులోని కేంద్ర కార్యాలయాలకు పంపడం పరిపాటిగా మారింది. మరి దీన్ని ఏ తరహా వ్యవస్థ అంటారో రాధాకృష్ణకే తెలియాలి. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర లక్షలలో డబ్బులు తీసుకొని.. వేలల్లో బిల్లులు ఇచ్చే సంస్కృతిని ఏమంటారో కూడా రాధాకృష్ణ వెల్లడించాలి. తన పత్రికను పక్కనపెట్టి ఇతర పత్రికలో వచ్చే ఫస్ట్ పేజీ వార్తలను కూడా రాధాకృష్ణ డిసైడ్ చేస్తున్నారంటే.. ఇది మామూలు పాత్రికేం కాదు. అన్నట్టు చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి కేసు నమోదు అయినప్పుడు.. ఆయన అరెస్టు అయినప్పుడు రాధాకృష్ణ ఎలా స్పందించారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎలా స్పందించారు? ఇక్కడే తెలిసిపోతుంది రాధాకృష్ణ సచ్చీలత.. పాత్రికేయుడు అనగానే ప్రశ్నించడం మాత్రమే కాదు.. ఆ ప్రశ్నను అడిగే అధికారం తనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మీడియా అధిపతి ఒక ఎరిటోరియల్ రాసేటప్పుడు.. ఆ అధికారం తనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. యశ్వంత్ శర్మ ఇంట్లో డబ్బులు దొరికాయి. నిజంగానే అది క్షమించరాని అని నేరం. పైగా న్యాయవ్యవస్థ అది తమ అంతర్గత వ్యవహారమని చెప్పడం మరింత నేరం. ఇలాంటి తీరు మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు. అయితే ఇలాంటి ప్రశ్నలు వేసేటప్పుడు.. ఇలాంటి సంపాదకీయాలు రాసేటప్పుడు కచ్చితంగా రాసేవారికి ఆ అర్హత ఉండాలి. అంటే తప్ప గురివింద గింజ సామెతను నిజం చేసి చూపించొద్దు.