KCR VS ABN RK
RK kothapaluku : మీడియా ఇలా మారిన తర్వాత.. మీడియా అధిపతులు రాజకీయరంగులు.. తెర వెనుక లావాదేవీలకు అలవాటు పడిన తర్వాత..ఇందులో సచ్చీలతను అంచనా వేయడం ముమ్మాటికి మన తప్పే అవుతుంది. అయితే ఇలాంటి మీడియాలోనూ కొంతమంది అప్పుడప్పుడు న్యూట్రాలిటీ ని ప్రదర్శిస్తారు. అలాంటి కోవలోకి వస్తారు ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ(Andhra Jyothi managing director vemuri Radhakrishna). సహజంగా తెలుగుదేశం(Telugu Desam) అంటే.. రేవంత్ రెడ్డి(revanth Reddy) అంటే పక్షపాతం చూపిస్తారు అనే ఆరోపణలు ఉన్న వేమూరి రాధాకృష్ణ అప్పుడప్పుడు మాత్రం తనలో ఉన్న జర్నలిజం బ్యూటీ ని బయటికి తీస్తారు. అమావాస్యకో, పౌర్ణమికో ఆ చెణుకులు విసురుతారు. అలాంటి చెణుకులు ఈ ఆదివారం కొత్త పలుకులో విసిరారు. తన పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం కొత్త పలుకు శీర్షికన వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తారు వేమూరి రాధాకృష్ణ. అయితే గతవారం వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఆంధ్రజ్యోతి(Andhra Jyothi)లో ప్రచురితం కాలేదు. వారం గ్యాప్ తర్వాత వచ్చిన వేమూరి రాధాకృష్ణ తనలో ఉన్న జర్నలిజం బ్యూటీని మరోసారి ప్రదర్శించారు. ఈసారి చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు. రేవంత్ రెడ్డి వ్యవరిస్తున్న తీరును బయటపెట్టారు. కెసిఆర్(KCR) పై మొహమాటం లేకుండా రాస్కొచ్చారు. జగన్(Jagan Mohan Reddy) ను కూడా తూర్పారబట్టారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అధికారం కోసం ఏదైనా చేస్తారని.. ఎంతకైనా తెగిస్తారని.. తమ తప్పులను తాము తెలుసుకోలేరని.. తమను ఓడించిన ప్రజలనే దూషిస్తారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
అందుకే ఓడిపోయారట
2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి స్వీయ తప్పిదాలే కారణమట. చంద్రబాబు(Chandrababu Naidu) తప్పులు చేస్తున్నప్పటికీ.. ఆయనకు వాటిని వివరిస్తుంటే వినిపించుకోలేదట. అందువల్లే ఓటమిపాలయ్యారట.. ఇక కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పాటు పరిపాలన సాగించినప్పటికీ.. ప్రజల మనసు మూడవసారి చూర గొనకపోవడానికి ఆయనలో ఉన్న అహంకార పూరితమైన ధోరణి కారణమట. ఆ లెక్కన వేమూరి రాధాకృష్ణ లో అహంకారం ఏమాత్రం లేదట. ఆయన సర్వ పరిత్యాగి అట. ఇప్పుడు రేవంత్ కూడా సరిగ్గా పరిపాలించడం లేదట.. 15 నెలల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలన గాడిలో పడలేదట. అసంతృప్తి నెమ్మదిగా వ్యాపిస్తోందట. కెసిఆర్ పై ఉన్న ఆగ్రహం ప్రజల్లో క్రమేపి తొలగిపోతోందట.. ఒకవేళ ప్రజల్లో ఆగ్రహం ఆ స్థాయిలో లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు రాధాకృష్ణ చెప్పలేకపోయారు. అసలు ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు.. ఇక చివరిగా జగన్ బటన్ నొక్కుడుకు మాత్రమే పరిమితమయ్యారట.. అందువల్లే ఆయనను ప్రజలు తిరస్కరించారట.. ఈ కారణాలు మొదటినుంచి ఉన్నవే. కాకపోతే ఇందులో రాధాకృష్ణ ఇలాంటి విషయాలను నేరుగా రాయడం.. మొహమాటం లేకుండా తన పత్రికలో ప్రచురించడం గొప్ప విషయం. చంద్రబాబును, రేవంత్ రెడ్డిలో ఉన్న తప్పులను రాధాకృష్ణ బయట పెట్టడమే అసలైన మ్యాజిక్. ఈ వారం కొత్త పలుకులో అదే హైలెట్ కూడా. అన్నట్టు కెసిఆర్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తొలగిపోతోందని వేమూరి రాధాకృష్ణ రాశారు అంటే.. బావాబామ్మర్దుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయినట్టేనా..