
దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుండగా, మరోవైపు వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు గత కొన్ని రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై మరో 29 పైసలు, డీజిల్ పై 24 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 94.23, డీజిల్ రూ. 85.15 కు పెరిగాయి. ఇక ముంబైలో పెట్రోల్ రూ. 100.47, డీజిల్ రూ. 92.45గా ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 97.93, డీజిల్ రూ. 92.83 గా ఉన్నది.