
కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కేరళలో కొత్తగా 22,129 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. కరోనా మరణాలు కూడా ఇవాళ కేరళలో భారీగానే నమోదయ్యాయి. ఒక్కరోజే 156 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.