
ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెబుతూనే మరోవైపు ప్రభుత్వ భూములను విక్రయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ప్రభుత్వ అవసరాల కోసం భూములు కావాలంటే ఏం చేస్తారు? ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యాలయాలకు భూమి కావాలంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేయకుండా తెలంగాణ జాతి సంపదను సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విక్రయిస్తూ పోతే చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయన్నారు. గాంధీభవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. పాలకవర్గం బినామీలే వేలంలో పాల్గొన్నారు. భూముల వేలంలో నిబంధనలు ఉల్లంఘించారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారు అని తెలిపారు.