
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ప్రస్తావించారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై విచారణను ఎన్జీటీ ఈరోజుకు వాయిదా వేసింది. కానీ, ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్ వేశామని ఏఏజీ ఎన్టీటీ దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేఆర్ఎంబీ, కేంద్రపర్యావరణ శాఖ అధికారులు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నేడు నేడు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం తనిఖీ చేయకుండా అదికారులను అడ్డుకోవడంతో ఇంతవరకు ఆ విభాగాలు నివేదిక ఇవ్వలేదని ఏఏజీ ఎన్జీటీకి తెలిపారు.