
బాలికపై అత్యాచారం కేసులో దోషికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2వేల జరిమానా విధించింది. 2018లో హైదరాబాద్ శివారులోని మైలార్ దేవ్ పల్లిలో అరుణ్ అనే యువకుడు ఇంటిపక్కనే ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసును విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పును వెలువరించింది.