Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా కనిసిస్తోంది. వచ్చే 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణకు వచ్చేసిన నైరుతీ రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.