Indian Railways: జూలై 1 నుంచి రైల్వే టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ధరలు కీలో మీటర్ కి పైస చొప్పున, ఏసీ రైళ్లలో కిమీ 2 పైసల చొప్పున పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సబ్ అర్భన్, సీజనల్, 500 కీలో మీటర్ లోపు సెకండ్ క్లాస్ ప్రయాణాల టికెట్లపై పెంపు ఉండదని వెల్లడించాయి. 500 కీలో మీటర్లు దాటితే కీలో మీటర్ కు అరపైసా చొప్పున పెంపు ఉంటుందని పేర్కొన్నాయి. దీని పై అధికార ప్రకటన రావాల్సి ఉంది.