
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఇవాళ పార్లమెంట్ కు ట్రాక్టర్ పై వచ్చారు. రైదుల సందేశాలను పార్లమెంటకు మోసుకువచ్చినట్లు రాహుల్ తెలిపారు. రైతు గొంతును ప్రభుత్వం నొక్కిపెడుతోందని ఆరోపించారు.