నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. మంత్రులు ఫిర్ హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో కార్యకర్తలు ఆగ్రహాంతో ఊగిపోయారు. కోల్ కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై గవర్నర్ జగదీప్ ధనఖర్ స్పందించారు. సీబీఐ కార్యాయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం, రాళ్ల దాడి చేయడం టీవీ చానెల్స్ ఇతర మాధ్యమాల ద్వారా చూశాను. బెంగాల్ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయకుండా ప్రేక్షకపాత్ర వహించడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. శాంతి భంద్రతలను కాపాడాలని గవర్నర్ పోలీసులకు సూచించారు.