
మరి కొద్ది గంటల్లో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలు ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ రాణే, హీనా గవిట్, శర్వానంద్ సోనోవాల్, శోభ, అజయ్ విశ్రా, మీనాక్షి లేఖి, రీటీ బుహుగుణ, ఆర్సీపీ సింగ్, భూపేంద్ర యాదవ్, పశుపతి పరాస్ తదితరులు లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసానికి వచ్చారు.