
రష్యాకు చెందిన స్పుత్నిక్ -వీ టీకాలు హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకాల గురించి ఇవాళ సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉన్న భారతీయ దౌత్యాధికారి డీ బాలా వెంకటేశ్ వర్మ మాట్లాడారు. భారత్ లో మొత్తం 85 కోట్ల స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు వెంకటేశ్ వర్మ తెలిపారు. స్పుత్నిక్ ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో 70 శాతం వరకు ఇండియాలోనే ఉత్పత్తి అవుతాయన్నారు. భారత్ లో మూడు దశల్లో స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. తొలుత రష్యా నుంచి టీకాలను సరఫరా చేస్తామరి అది ఇప్పటికే స్టార్ట్ అయ్యిందన్నారు.